అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం..

by Ramesh Naini |

అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లి

Union Minister Kishan Reddy Asks CM KCR for Evidence Of Cloudburst
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లి నియోజకవర్గం‌లో ఇవాళ కిషన్ రెడ్డి పర్యటించారు. మల్లె పల్లి డివిజన్ అఘాపురలో పవర్ బోర్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు గత ఆరు నెలలుగా స్ట్రీట్ లైట్స్ లేవంటూ మంత్రికి ఫిర్యాదు చేశారు. నవంబర్‌లో పిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదన్న బస్తి వసూలు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే 4 నెలలుగా ఎందుకు చేయలేదని అధికారులపై మంత్రి సీరియస్ అయ్యారు. నిధులు లేవని అధికారులు చెప్పడంతో వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్‌తో కిషన్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. మల్లేపల్లి డివిజన్ అఘాపురలో వెంటనే స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయాలని కమిషనర్‌కు ఫోన్‌లో ఆదేశాలిచ్చారు.

Next Story