కేంద్ర మంత్రుల పనితీరు గ్రేడింగ్‌లో కిషన్ రెడ్డి నంబర్-వన్​

by Naga Rani Yarlagadda |

కేంద్ర మంత్రుల పనితీరు గ్రేడింగ్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నంబర్​వన్ ర్యాంక్​సాధించడం పట్ల బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్​ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్​ హర్షం వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రుల పనితీరు గ్రేడింగ్‌లో కిషన్ రెడ్డి నంబర్-వన్​
X
  • అభినందనలు తెలిపిన ఓబీసీ మోర్చా జాతీయ సభ్యులు పెరిక సురేష్​

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర మంత్రుల పనితీరు గ్రేడింగ్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నంబర్​వన్ ర్యాంక్​సాధించడం పట్ల బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్​ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్​ హర్షం వ్యక్తం చేశారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్​మాట్లాడుతూ ప్రధాని మోడీ మంత్రివర్గంలోని కేంద్ర మంత్రుల పనితీరు అంచనాల్లో కిషన్ రెడ్డి గ్రేడింగ్​లో నంబర్-వన్​ స్థానం సాధించడం ఆయన పరిపాలనా నైపుణ్యం, అభివృద్ధిపట్ల అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని మోడీ చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప సాధనలో సమర్థవంతంగా పనిచేస్తూ విశిష్ట సేవలు అందిస్తున్నారని కొనియాడారు. తెలంగాణ గర్వించదగ్గ నాయకుడిగా, బీజేపీకి అంకితభావంతో సేవలందిస్తున్న నేతగా ఆయన పేరు దేశవ్యాప్తంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్​గౌడ్, బీజేపీ రాష్ట్ర మీడియా విభాగం చీఫ్ ఎన్​వీ సుభాష్​ తదితరులు పాల్గొని కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story