- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంటలకు కనీస మద్దతు ధర పెంపు : మోడీకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు
ఖరీప్సీజన్లో 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినేట్నిర్ణయం తీసుకోవడం స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఖరీప్సీజన్లో 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినేట్నిర్ణయం తీసుకోవడం స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఈనిర్ణయంతో తెలంగాణ రైతులతో పాటు దేశంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, ముఖ్యంగా వరి, పత్తి, జొన్న, వేరుశనగ, కంది పప్పు పండించే రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. ఆర్ధిక వ్యవహారాల కేంద్ర కేబినెట్నిర్ణయం ప్రకారం వరి కనీస మద్దతు ధర రూ. 2300 నుంచి రూ. 2369కి పెరిగింది. 2013–14 కనీస మద్దతు ధరతో పోల్చుకుంటే 81 శాతం ఎక్కవగా ఉందన్నారు.
పత్తి క్వింటాళ్లపై రూ. 589, వేరుశనగా రూ. 480, కంది పప్పు రూ. 450, జోన్న పంటపై రూ. 328, మొక్కజోన్నపై రూ. 175, నువ్వులపై రూ. 579 పెరిగిందన్నారు. మోడీ ప్రభుత్వం నిర్ణయంతో తెలంగాణ రైతులకు ఎంతో లబ్ది కలుగుతుందన్నారు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తృణ ధాన్యాలతో పాటు నూనె విత్తనాలు, చిరుధాన్యాలు వంటి వాటికి కనీన మద్దతు ధరనుపెంచడం ద్వారా వీటి ఉత్పత్తి కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






