- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kishan Reddy: మతోన్మాద మజ్లిస్‌కు సపోర్ట్ చేస్తుండ్రు.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై కిషన్ రెడ్డి ఫైర్
హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల ఎన్నికలో మతోన్మాద మజ్లిస్ (Majlis)కు కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు సపోర్టు చేస్తున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన ఆరోపణలో చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల ఎన్నికలో మతోన్మాద మజ్లిస్ (Majlis)కు కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు సపోర్టు చేస్తున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన ఆరోపణలో చేశారు. ఇవాళ ఆయన నాంపల్లి పార్టీ కార్యాయంలో బీజేపీ (BJP) కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు (Gautham Rao)తో పాటు మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రా రెడ్డి (Ramchandra Reddy) హాజరయ్యారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికపై మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించారు. ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా చూడాలని కార్పొరేటర్లకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ అవకాశాలపై చర్చించారు.
అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అధికార, ప్రతిపక్ష పార్టీలు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండటానికి కారణమేంటని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు మజ్లిస్‌కు అండగా నిలబడుతున్నాయని కామెంట్ చేశారు. మజ్లిస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ప్రజలకు కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలకు ఓటు వేయలేదని ఎద్దేవా చేశారు. బీజేపీని ఓడించేందుకు ఆ రెండు పార్టీలు కలిసి పని చేస్తూ మతోన్మాద మజ్లిస్‌కు సపోర్టు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కార్పొరేటర్లను ఓటు వేయనివ్వకుండా బీఆర్ఎస్ బెదిరిస్తోందని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ఓటేసి గెలిపించిన ప్రజలను అవమానించడమేనని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.
రైతులకు తీరని నష్టం..
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ పాటు బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఆ పథకాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులకు భారీగా పంట నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రీమియం కడతామని గతంలో కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చి మరిచిందని .. ఇప్పుడు అసలుకే ఎసరు వచ్చేసరికి ప్రభుత్వం వారిని గాలికొదిలేసిందని కామెంట్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్రంలో ఫసల్ బీమాను అమలు చేయాలని కిషన్ రెడ్డి సూచించారు.






