- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్‌తో దోచుకుంటుంది
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ట్యాక్స్పేరుతో తెలంగాణను దోచుకుంటోందని, దీనిని నుంచి ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్‌తో దోచుకుంటుంది
ఆ పార్టీ పాలకుల పట్ల ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది
ఏపీకి అమరావతి రాజధాని కావాలని బీజేపీ కోరుతుంది : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ట్యాక్స్పేరుతో తెలంగాణను దోచుకుంటోందని, దీనిని నుంచి ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. ఏ లక్ష్యం కోసం స్వరాష్ట్రం సాధించమో ఆ లక్ష్యాల సాధన జరగడం లేదని,తెలంగాణ ప్రజల పోరాటాన్ని నవ్వులపాలు చేసే విధంగా కాంగ్రెస్ పాలన సాగుతోందన్నారు. బుధవారం ఆంద్రప్రదేశ్శాశ్వత రాజధాని అమరాతిగా దృవీకరిస్తూ పార్లమెంటు ప్రవేశ పెట్టిన తీర్మానంపై ప్రసంగించారు. అమరావతి అద్భుతమైన రాజధానిగా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తోందన్నారు. ఏపీ రాష్ట్రానికి అమరావతి రాజధాని కావాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఓ సానుకూలమైన పరిస్థితి రావడం చాలా సంతోషంగా ఉందని, అన్నదమ్ముల్లాగా ఈ రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏపీలో కూడా గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటైందన్నారు. రాష్ట్రం ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలను నిర్లక్ష్యం చేసిందని మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. సుదీర్థమైన పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని, కాంగ్రెస్ పార్టీ 1969లో జై తెలంగాణ అన్నందుకు 369 మంది ఉద్యమకారులను కాల్చి చంపింది.
కాంగ్రెస్మెడలు తెలంగాణను సాధించిన ఉద్యమకారులు
ఆ తర్వాత చివరిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఆత్మబలిదానం చేశారని తెలిపారు. నాలుగు కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణతోపాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పోటీగా అభివృద్ధి చెందాలని భావించామన్నారు. అక్కడి ప్రజలు తమకు రాజధాని లేదని బాధపడే పరిస్థితి నెలకొనడం దురదృష్టకరం. పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు ప్రసంగంపై కాంగ్రెస్ సభ్యులు కొందరు తెలంగాణకు విమానాశ్రయాలు లేవని చెప్పారు. విమానాశ్రయాలు లేకపోవడానికి కారణం ఎవరు ఆ పాపం ఎవరిది చెప్పగలరా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో 8 విమానాశ్రయాలు ఉంటే తెలంగాణ లో కేవలం ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విమానాశ్రయాలు ఇవ్వలేదు.
తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగూడెంలో, వరంగల్ లో, ఆదిలాబాద్ లో విమానాశ్రయాలకు భూమి కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినా ఈ విమానాశ్రయాలకు భూములు ఇవ్వకుండా కనీసం స్పందించలేదని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు రైల్వేలు, జాతీయ రహదారుల అభివృద్ధి జరగలేదు. తెలంగాణ అనేక రకాలుగా వెనుకబడటంతోనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చిందన్నారు. రాష్ట్రంలో రైల్వేలు, జాతీయ రహదారులు మొదలుకుని అన్నిరకాల అభివృద్ధి పనులకు కేంద్రం అండదండగా నిలుస్తోంది. 42 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ఏకకాలంలో చేసుకుంటున్నామని, గతంలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులుంటే ఈ పదేళ్లలో అదనంగా దాదాపు 3 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. గతంలో పదేళ్లపాటు తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు.






