కిషన్‌ రెడ్డి దుప్పటి కప్పుకుని పడుకుండు.. సీఎం రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-21 07:26:08  IST  )

దాయాది పాకిస్థాన్‌ (Pakistan)కు బుద్ధి చెప్పడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు.

కిషన్‌ రెడ్డి దుప్పటి కప్పుకుని పడుకుండు.. సీఎం రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దాయాది పాకిస్థాన్‌ (Pakistan)కు బుద్ధి చెప్పడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. ఇవాళ రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా ఆయన సచివాలయ (Secretariat) ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. పాక్‌తో పోరులో అమెరికా ఒత్తిడికి మోడీ సర్కార్ తలొగ్గిందని కామెంట్ చేశారు. దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) పాకిస్థాన్‌తో యుద్ధం వస్తే ప్రపంచ దేశాలతో పాటు అమెరికా (America) నుంచి కూడా ఒత్తిళ్లు వచ్చాయని.. అవన్ని ఆమె బేఖాతరు చేయకుండా యుద్ధం కొనసాగించి విజయం సాధించారని గుర్తు చేశారు. దేశ సమగ్రత విషయంలో తాము రాజకీయాలు చేయబోయని అన్నారు.

ప్రధానిగా రాజీవ్ గాంధీ దేశానికే వన్నె తెచ్చి ఓ ఆర్థిక శక్తిగా నిలబెట్టారని కామెంట్ చేశారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలకు తలొగ్గి పాక్‌ పని పట్టేందుకు వచ్చిన సువర్ణావకాశాన్ని కేంద్ర ప్రభుత్వం చేజార్చుకుందని ఫైర్ అయ్యారు. పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) తర్వాత దేశంలో తొలిసారిగా తిరంగా ర్యాలీ తీసింది తామేనని తెలిపారు. ఇరు దేశల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ప్రధానికి మద్దతుగా ఉండాల్సిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ రోజు దుప్పటి కప్పుకుని పడుకుండని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో పార్టీలను పక్కన పెట్టి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సంపూర్ణ మద్దతును ప్రకటించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story