- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే రాష్ట్రాల అభివృద్ధి.. గెలుపు సంబరాల్లో కిషన్ రెడ్డి

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎక్కడెక్కడ అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నదో ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకున్న సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతలు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్ లాంటి రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని, అక్కడ అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. ఢిల్లీలో బీజేపీ గెలుపునకు ప్రధాని సమర్థవంతమైన పాలన, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే కారణమన్నారు.
ఎమ్మెల్సీ, జీహెచ్ఎమ్‌సీ ఎన్నికలే టార్గెట్
అనంతరం గ్రేటర్ బీజేపీ కార్పొరేటర్లతో కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. గ్రేటర్ సమస్యలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంపై చర్చలు జరిపారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యంపైనా పలు సూచనలు చేశారు. గ్రేటర్ సమస్యలపై ఫోకస్ చేయాలని సూచించారు.