- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kishan Reddy: 29న అమిత్ షా చేతుల మీదుగా పసుపు బోర్డు గ్రాండ్ ఓపెనింగ్ : కిషన్ రెడ్డి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా 29న పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేతుల మీదుగా 29న పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. ఇవాళ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక సంవత్సరాల పసుపు రైతుల ఆకాంక్ష బోర్డుతో నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. అనేక రాజకీయ పార్టీలు హామీ ఇచ్చినా అర్వింద్ కృషి వల్ల ప్రధాని మోడీ ఆశీస్సులు ఆదేశాలతో (Turmeric board) పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్త కార్యక్రమాలకు కేంద్రంగా నిజామాబాదు లోనే బోర్డు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఇతర రాష్ట్రాలు కోరినా మోడీ నిజామాబాదులోనే ఏర్పాటు చేయడం ఇక్కడి రైతులకు అందించిన బహుమతి అని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన రైతు బిడ్డ అయిన గంగారెడ్డిని చైర్మన్ చేయడం మరో విశేషం అని చెప్పారు. 29న రైతులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున రావాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో పసుపు ఉత్పత్తి పెరిగే విధంగా.. ఉపాధి పెరిగే విధంగా.. రైతులకు ప్రయోజనం కలిగే విధంగా బోర్డు కార్యాచరణతో ముందుకు సాగుతుందన్నారు. మాజీ మంత్రి డీఎస్ విగ్రహాన్ని కూడా అమిత్ షా నిజామాబాదులో 29న ఆవిష్కరిస్తారని స్పష్టం చేశారు.
సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు అప్పగించాలి
సీఎం రేవంత్ పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు పదే పదే పోన్ ట్యాపింగ్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశారని గుర్తుకు చేశారు. తెలంగాణ పోలీసులపైనే స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తే న్యాయం జరగదని కాంగ్రెస్ లో ఉన్న వారు కూడా అంటున్నందున బీఅర్ఎస్‌తో కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలంటే.. రేవంత్‌కు చిత్తశుద్ది ఉంటే సీబీఐకి పోన్ ట్యాపింగ్ కేసును అప్పగించాలని డిమాండ్ చేశారు. హై కోర్టు న్యాయవాదుల పోన్లు కూడా ట్యాపయ్యాయని ఆరోపించారు. మొదటి నుంచి ట్యాపింగ్ కేసును సీబీఐ కి కాంగ్రెస్ ఇస్తుందా? ఇవ్వదా? అనే అనుమానంతో బీజేపీ హైకోర్టుకు వెళ్ళిందన్నారు. ట్యాపింగ్ కేసు సాధారణమైనది కాదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు సీబీఐకి కేసును అప్పగించాలని డిమాండ్ చేశారు.






