- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిఖిత కుటుంబానికి అండగా ఉంటాం : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
by Muthe.Rajitha |
నిఖిత కుటుంబ సభ్యులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపం

X
దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన గోడిశాల నిఖిత మాజీ ప్రియుని చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటున్న నిఖిత కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలియజేశారు. నిఖిత మృతి విషయం తెలిసిన వెంటనే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో మాట్లాడినట్లు చెప్పారు. నిఖిత మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి అవసరమైన సహకారం అందించాలని ఆయనను కోరినట్లు తెలిపారు. ఈ విషయంలో అధికారులు నిఖిత కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అవసరమైన సహాయం అందిస్తున్నాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కిషన్ రెడ్డి ట్వీట్ చేసారు.
Next Story






