- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తులకు గుడ్‌న్యూస్.. అతిత్వరలో కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ పూర్తి : కేంద్ర మంత్రి ట్వీట్
త్వరలో కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ పూర్తి కాబోతున్నాయని కేంద్ర మంత్రి గుడ్‌న్యూస్ చెప్పారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భక్తులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలో (Komuravelli Mallanna) కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ పూర్తి కాబోతున్నాయని, 96 శాతం పనులు పూర్తి అయ్యాయని శనివారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా, కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తుల కోరిక మేరకు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త రైల్వే స్టేషన్ పనులు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. అతి త్వరలో ఈ స్టేషన్ ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని శుభవార్త తెలిపారు.
హైదరాబాద్ నుంచి రోజూ వేలాదిగా భక్తులు కొమురవెల్లి మల్లన్న దర్శనార్థం కొమురవెల్లి వెళ్తుంటారని వివరించారు. నూతన రైల్వే స్టేషన్ నిర్మాణంతో భక్తుల ప్రయాణ కష్టాలు తీరడమే కాకుండా ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం మెరుగవనుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలనే కట్టుబాటును కొత్తగా నిర్మించిన కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రతిబింబిస్తుందని పోస్ట్ చేశారు. ట్వీట్ ఇదే..






