- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముందు మొదటి దశ మెట్రోను టేకోవర్ చేసుకోండి.. సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ
మెట్రో రెండో దశ పనులకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రెండో దశ నిర్మాణం గురించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో చర్చించినట్టు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: మెట్రో రెండో దశ పనులకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రెండో దశ నిర్మాణం గురించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో చర్చించినట్టు తెలిపారు. మెట్రో మొదటి దశ లావాదేవీలు పూర్తయిన తర్వాత రెండో దశ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినట్టుగా ముందుగా మొదటి దశను టేకోవర్ చేసుకోవాలని చెప్పినట్టు తెలిపారు.
మొదటి దశను ఎల్ అండ్ టీ నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, రెండో దశకు సన్నాహాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున కమిటీ వేయాలని మనోహర్ లాల్ ఖట్టర్ ఇప్పటికే మీతో చెప్పినట్టు తెలిపారన్నారు. ఆ కమిటీ కోసం రాష్ట్రం నుండి ఇద్దరు అధికారుల పేర్లను పంపాలని చెప్పారు. మొదట ఎల్ అండ్ టీ నుండి మెట్రో నెట్ వర్క్ ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, తరవాత మెట్రో రెండో దశ నిర్మాణానికి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.






