- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బనకచర్లపై కిషన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు
బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మరోసారి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన "ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్"ను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందని అన్నారు. కొంతమంది దుందుడుకు విధానంతో కేంద్రమంత్రులు ఏం చేస్తున్నారు అంటూ చౌకబారు విమర్శలు చేస్తున్నారు.. నీటి పంపకాలు, వరద జలాల విషయంలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా ఆ రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు. అంతేగాకుండా.. తెలంగాణలో మెడికల్ కాలేజీల దీన స్థితికి గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని మండిపడ్డారు. కనీస వసతులు కల్పించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేయగా... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వైద్య కళాశాలల్లో కనీసం కొత్త కుర్చీలు, బెంచీలు కూడా తేలేదని ఎద్దేవా చేశారు. రూ.10 లక్షల కోట్లు అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, కనీసం మెడికల్ కాలేజీల్లో వసతులు కల్పించకపోవడం సిగ్గు చేటు అని సీరియస్ అయ్యారు. ట్వీట్






