- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ మెట్రో అనుమతులు వచ్చేది అప్పుడే : కిషన్ రెడ్డి పిలుపు
నిర్మాణ రంగంలో స్వదేశీ వస్తువులనే వాడాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : నిర్మాణ రంగంలో స్వదేశీ వస్తువులనే వాడాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. నేడు హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ లో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో హైదరాబాద్ నగరం ఐటీ, ఫార్మా రంగాల్లో దూసుకుపోతుందని.. త్వరలోనే నిర్మాణ రంగంలో కూడా ముందువరుసలో ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో వస్తున్న మార్పుల దృష్ట్యా భారత్ లోని నిర్మాణ రంగంలో స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలని నిర్మాణ సంస్థలకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.
తెలంగాణకు అంతర్జాతీయస్థాయి రోడ్లను మంజూరు చేశామని తెలిపారు. అలాగే వరంగల్ కు మామునూరు ఎయిర్ పోర్టు, ఆదిలాబాద్ లో ఉన్న డిఫెన్స్ ఎయిర్ పోర్టును సివిల్ ఎయిర్ పోర్టుగా మార్చామని అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను రూ.70 కోట్లతో ఆధునీకరిస్తున్నామని అన్నారు. MMTS రైళ్లను ఏసీ రైళ్లుగా మారుస్తామని పేర్కొన్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో మెట్రో 2వ దశ పెండింగ్ లో ఉందని, త్వరలోనే దానికి కూడా అనుమతులు వస్తాయని కిషన్ రెడ్డి వెల్లడించారు.






