- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kishan Reddy: దేశంలో కనెక్టివిటీ పెంచడమే మోడీ సర్కార్ లక్ష్యం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దేశంలో రోడ్డు, రైల్వే, విమాన కనెక్టివిటీ పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం (Central Government) అంకిత భావంతో పని చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రోడ్డు, రైల్వే, విమాన కనెక్టివిటీ పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం (Central Government) అంకిత భావంతో పని చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఇవాళ కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) పర్యటిస్తున్నారు. జిల్లాలో రూ.3,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కశ్మీర్ (Kashmir) నుంచి కన్యాకుమారి (Kanyakumari) వరకు కనెక్టివిటీ పెంచడమే మోడీ సర్కార్ లక్ష్యమని అన్నారు. నేడు రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తీర్ణం 5 వేల కి.మీ దాటిందని తెలిపారు. జాతీయ రహదారుల విస్తరణతో రోడ్డు ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గాయని, ప్రయాణ సమయం భారీగా తగ్గిందని పేర్కొన్నారు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
దేశ వ్యాప్తంగా 7 టెక్స్‌టైల్స్ పార్కులు (Textiles Parks) మంజూరు చేస్తే.. అందులో తెలంగాణకు కూడా ఒకటి దక్కడం సంతోషకరమని అన్నారు. రూ.6,330 కోట్లతో రామగుండం యూరియా ఉత్పత్తి పరిశ్రమను పునరుద్ధరించకున్నామని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్ జిల్లా (Nizamabad)కు పసుపు బోర్డు మంజూరు చేసి కేంద్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని అన్నారు. దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా రేషన్ బియ్యాన్ని మోడీ సర్కార్ ఇస్తుందని అన్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధరను రూ.1,400 నుంచి రూ.2,300కు పెంచామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని.. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని కిషన్ రెడ్డి అన్నారు.
Read More: Seethakka: మీరే చొరవ తీసుకోవాలి.. నితిన్ గడ్కరీకి మంత్రి సీతక్క రిక్వెస్ట్






