నితిన్ గడ్కరీతో కిషన్ రెడ్డి భేటీ..తెలంగాణ ప్రాజెక్టులపై చర్చ

by Prasad Jukanti |
నితిన్ గడ్కరీతో కిషన్ రెడ్డి భేటీ..తెలంగాణ ప్రాజెక్టులపై చర్చ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర రడ్డు రవాణా, జాతీయ రహదారి మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. గురువారం ఢిల్లీలో గడ్కరిని మర్యాదపూర్వకంగా కలికి శాలువాతో సత్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కాగా కాగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఇవాళ కిషన్ రెడ్డి తొలిసారి తెంగాణకు రాబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ సెల్యూట్ తెలంగాణ పేరుతో హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ ర్యాలీలో కేంద్రమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు ‘సెల్యూట్ తెలంగాణ ర్యాలీ’ నిర్వహించనున్నారు.

Advertisement

Next Story