Kishan Reddy: మెట్రో విస్తరణను కేంద్రం ఆపడం లేదు.. కేంద్ర మంత్రితో కిషన్ రెడ్డి భేటీ

by Ramesh Naini |

హైదరాబాద్‌లో మెట్రో విస్తరణను కేంద్రం ఆపడం లేదని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Kishan Reddy: మెట్రో విస్తరణను కేంద్రం ఆపడం లేదు.. కేంద్ర మంత్రితో కిషన్ రెడ్డి భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో మెట్రో విస్తరణను కేంద్రం ఆపడం లేదని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari)ని కలిశారు. ఈ మేరకు తెలంగాణలో (National Highways) జాతీయ రహదారుల ప్రాజెక్టుల అభివృద్ధి గురించి చర్చించారు. రాష్ట్రంలో కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రాజెక్టుల విస్తరణపై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన న్యూ ఢిల్లీలోని బీజేపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అత్యంత వేగవంతంగా సమర్ధవంతంగా పురోగతి సాధిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2015 వరకు రాష్ట్రంలో 2500 కిలో మీటర్ల జాతీయ రహదారులు ఉండేవని తెలిపారు. ఈ పదేళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం డబుల్ అయిందని, సుమారు 5 వేల కిలోమీటర్లకు పైగా ఇప్పటికే పూర్తి అయిందని చెప్పారు.

దేశ అభివృద్ధికి జాతీయ రహాదారుల పాత్ర చాలా కీలకం గా ఉందన్నారు. తెలంగాణలో అన్ని జిల్లాలలో నేషనల్ హైవేలకు అనుసందానం జరుగుతోందని, 31 జిల్లాలలో పూర్తి కూడా అయినట్లు క్లారిటీ ఇచ్చారు. దీంతో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా హైవేలపై రోడ్ సేఫ్టీ పెరిగిందన్నారు. నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి సుమారు రూ.30 వేల కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఇందులో కరీంనగర్‌‌లో మహదేవ్ పూర్ నుంచి సిరోచ వరకు 17 కిలోమీటర్ల రోడ్డు రూ.163 కోట్లతో చేపట్టనున్నట్లు తెలిపారు. నల్గొండలో గౌరెల్లి నుంచి వలిగొండ వరకు 42 కిలోమీటర్ల రోడ్డు రూ.690 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే నకిరేకల్ నుంచి నాగార్జున సాగర్ వరకు 14 కిలోమీటర్ల రోడ్డు రూ.516 కోట్లతో నిర్మాణం, తెలంగాణ ఏపీకి అనుసందానం చేసే కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి సుమారు రూ.1082 కోట్లతో బ్రిడ్జి రానున్నట్లు చెప్పారు.

ఈ బ్రిడ్జికి కనెక్టివిటీ కోసం రూ.430 కోట్లతో 13 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం మంజూరు అయిందని తెలిపారు. వరంగల్ తొర్రూర్ నుంచి నెహ్రూ నగర్ వరకు రూ.674 కోట్లతో 69 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇలా రాష్ట్రంలో రానున్న రోజుల్లో హైవేల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి చెప్పినట్లు వెల్లడించారు. 27 ప్రాజెక్టులు డీపీఆర్ స్టేజీలో ఉన్నాయని అన్నారు. తెలంగాణ మేలు కోరుకునే వ్యక్తుల్లో నేను ముందుంటా అని సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఆధారాలు లేకుండా అర్థం లేని వ్యాఖ్యలు మాట్లాడొద్దని సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి బీజేపీ ఫోబియా పట్టుకుందని విమర్శించారు. నేపాల్‌లో జరిగిన హింస భారత్‌లో జరుగుతుందని, కేటీఆర్‌ వ్యాఖ్యానించడం దేశద్రోహమే అని కిషన్‌రెడ్డి తప్పుబట్టారు.

Next Story