- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కిషన్ రెడ్డి భేటీ.. ఎంఎంటీఎస్‌పై కీలక హామీ
దేశ రాజధాని ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఇవాళ కిషన్ రెడ్డి భేటీ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw)తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) న్యూఢిల్లీలో ఇవాళ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు, రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్‌పై ఇద్దరు మంత్రులు సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా సాగుతున్న సుమారు 42 ప్రధాన రైల్వే అభివృద్ధి పనుల ప్రస్తుత స్థితిగతులపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులకు అత్యంత కీలకమైన కొత్త రైల్వేలైన్లు, హైస్పీడ్ రైల్ కారిడార్ పనుల పురోగతి, ఎంఎంటీఎస్ (MMTS) రైలు సర్వీసుల విస్తరణ, వాటి పురోగతిపై ఇరువురు నేతలు డిస్కస్ చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో రైల్వే నెట్‌వర్క్ (Railway Network) అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం పూర్తి అంకితభావంతో పనిచేస్తోందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రయాణికులకు ఎంతో కీలకమైన ఎంఎంటీఎస్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు వీలుగా, త్వరలోనే ఉన్నతాధికారులతో ప్రత్యేక భేటీ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.






