Kishan Reddy : పసుపు బోర్డు ఏర్పాటుపై కిషన్ రెడ్డి హర్షం

by Muthe.Rajitha |

నిజామాబాద్(Nizamabad) లో కేంద్ర ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డు(National Turmeric Board) ఏర్పాటు చేయడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) హర్షం వ్యక్తం చేశారు.

Kishan Reddy : పసుపు బోర్డు ఏర్పాటుపై కిషన్ రెడ్డి హర్షం
X

దిశ, వెబ్ డెస్క్ : నిజామాబాద్(Nizamabad) లో కేంద్ర ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డు(National Turmeric Board) ఏర్పాటు చేయడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) హర్షం వ్యక్తం చేశారు. సంక్రాంతి కానుకగా కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డుని తెలుగు రాష్ట్రాలకే కాదు యావద్దేశానికి అందిస్తోందన్నారు. రేపటి నుంచి పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనుందని తెలియజేశారు. ప్రధాని మోడీ(PM Modi) ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ దీన్ని ఏర్పాటు చేశారని అన్నారు. బోర్డు ఛైర్మన్ గా నియమించబడిన పల్లె గంగారెడ్డి(Palle Gangareddy)కి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story