- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు ద్రోహం చేస్తోంది కిషన్ రెడ్డే : సీఎం రేవంత్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచకపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నమ్మె పరిస్థితి లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి ఇంటిగ్రిటినే బిగ్ క్వశ్చన్ అని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశానికి రాకుండా ఢిల్లీలో పని ఉందని , అక్కడ కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ను రహస్యంగా కలిశారని విమర్శించారు. సీఆర్ పాటిల్‌ను రహస్యంగా కలవాల్సిన పనేముందని ఆయన ప్రశ్నించారు. తాము సీఆర్ పాటిల్‌ను కలుస్తున్నామని, తమతో రావాలని సీఎం కోరారు. తమతో పాటు వస్తే ఆయన కీరిటం పొతదా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను బతికించడానికి నీళ్ల సెంటిమెంట్ అనే ఆయుధాన్ని ఇవ్వాలని కిషన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కిషన్‌రెడ్డి అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడని సీఎం ఆరోపించారు. సమావేశానికి వచ్చిన బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘనందన్‌రావులు ప్రభుత్వ వాదనలకు మద్దతు తెలిపారన్నారు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించారని, భవిష్యత్ కార్యాచరణలో సహకరిస్తామని ప్రకటించారని సీఎం తెలిపారు. ప్రభుత్వం ఎక్కడికి వెళ్లిన రావడానికి సిద్దంగా ఉన్నామనివారు ప్రకటించారని, ఎక్కడికైనా తీసుకవెళ్తామని వారు చెప్పారన్నారు. వారి మాటల్లో తమకు స్పష్టంగా చిత్తశుద్ధి కనిపించిందన్నారు.
నది పరివాహక ప్రాంతం అవసరాలు తీరాకే ఇతర ప్రాంతాలకు నీళ్లు కేటాయించడం, తరలింపు, మళ్లీంచడం చేయాల్సి ఉంటుందని, అంతర్జాతీయ నీటి చట్టాలు కూడా ఇవే చెబుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులకు నీళ్ల కేటాయింపులు పూర్తి అయిన తరువాతనే ఇతర ప్రాంతాలకు తరలించడానికి లేదని ఆయన అన్నారు. జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ లను ఏర్పాటు చేశారని, వాటికి డీపీఆర్‌లు ఇవ్వలేదన్నారు. జీఆర్ఎంబీకి సమాచారం ఇచ్చాక, తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అనుమతులు పొందాల్సి ఉంటుందని, ఇవేవి పాటించకుండా నేరుగా కేంద్రం నుంచి అనుమతులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం అన్నారు.
మాజీ మంత్రి హరీశ్ రావు అక్కసుకు మందు లేదని, ఆసూయకు మందు ఉండదంటూ సీఎం ఎద్దేవా చేశారు. ఐదు నెలల నుంచి నిరంతరం బనకచర్లపై ఫిర్యాదులు చేయడం వల్ల అనుమతులు ఇవ్వడానికి కేంద్రం వెనక ముందు ఆడుతుందని రేవంత్‌రెడ్డి అన్నారు. మా ప్రయత్నాల వల్లనే అనుమతులపై కామ పడిందన్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు ఎన్ని అనుమతులు తీసుకవచ్చావంటూ సీఎం నిలదిశారు.






