- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీలో మీరు చేయాల్సిన పని అదే.. BJP ఎమ్మెల్యేలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం
బీజేపీ ఎమ్మెల్యేల(BJP MLAs)తో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎమ్మెల్యేల(BJP MLAs)తో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, హామీలపై నిలదీయాలని సూచించారు. ప్రజా సమస్యలపై చర్చకు పట్టుబట్టాలని చెప్పారు. కేంద్రం అందిస్తున్న సహకారాన్ని సభలో వివరించాలని అన్నారు. కాగా, అంతకుముందు డీలిమిటేషన్ (Delimitation)పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ చేస్తే సీట్లు తగ్గుతాయనేది ప్రతిపక్షాల దుష్ప్రచారం మాత్రమే అని అన్నారు.
పునర్విభజనకు సంబంధించి 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి విధానాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై కొత్త విధానం రాలేదన్నారు. శనివారం రైల్వే ఎంజీ అరుణ్ కుమార్ జైన్‌తో కలిసి కిషన్ రెడ్డి బేగంపేట్ రైల్వే స్టేషన్ (Begumpet Railway Station) డెవలప్మెంట్ పనులను పరిశీలించారు. రాబోయే ఐదేళ్లలో తెలంగాణలోని రైల్వేస్టేషన్ల స్వరూపమే మారబోతున్నదని కిషన్ రెడ్డి చెప్పారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు వాడీవేడీగా జరిగాయి.
READ MORE ...
Kishan Reddy: డీలిమిటేషన్ పై మరోసారి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దానిని ‘గేమ్ చేంజర్’ అనడం పెద్ద జోక్.. ఎమ్మెల్సీ కవిత షాకింగ్ కామెంట్స్






