- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ ఇంటిముందు మురుగునీరు ఉంటే ఉంటారా.. జీహెచ్ఎంసీ అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం
by Ajay Maddhiboyina |
జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని శ్రీకృష్ణానగర్ బస్తీలో శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. కమ్యూనిటీ హాల్ సీ బ్లాక్‌లో ఇళ్ల ముందు భారీగా మురికి నీరు ఉండటం చూసి ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని శ్రీకృష్ణానగర్ బస్తీలో శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. కమ్యూనిటీ హాల్ సీ బ్లాక్‌లో ఇళ్ల ముందు భారీగా మురికి నీరు ఉండటం చూసి ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్థానికులు గత కొద్దిరోజులుగా ఇక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతుందని కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు. అధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మీ ఇంటి ముందు ఇలానే మురుగునీరు ఉంటే ఒక్క నిమిషమైనా ఉండగలరా అంటూ ఫైర్ అయ్యారు. వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. వారం రోజుల్లో ఈ సమస్య ఉండకూదని హెచ్చరించారు.
Next Story






