కుటుంబ పాలన, అవినీతికి కాంగ్రెస్, BRS కవలపిల్లలు: Kishan Reddy

by Satheesh |   (  Updated:2023-10-22 12:10:15  IST  )

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల రెండవ లిస్ట్‌పై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దసరా తర్వాత బీజేపీ అభ్యర్థుల రెండవ

కుటుంబ పాలన, అవినీతికి కాంగ్రెస్, BRS కవలపిల్లలు: Kishan Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల రెండవ లిస్ట్‌పై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దసరా తర్వాత బీజేపీ అభ్యర్థుల రెండవ జాబితా విడుదల చేస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రజలు ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. దసరా తర్వాత విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.

ఈ నెల 27న అమిత్ షా, నెల చివర్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలంగాణలో ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మోడీ పాలనను రాష్ట్రంలోని ప్రతిగడపకు తీసుకెళ్తామన్నారు. బీఆర్ఎస్ వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మార్చుకుంటామన్నారు. కుటుంబ, అవినీతి పాలనకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కవలపిల్లలు అని విమర్శించారు.

Next Story