- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kishan Reddy: మీరా బీజేపీని విమర్శించేది.. కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి ఫైర్
కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) మరణంతో కాంగ్రెస్ (Congress) పార్టీ రాజకీయం చేస్తోందని ఇది ఆ పార్టీ సంస్కారహీనతకు అద్దం పడుతున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన మన్మోహ్ సింగ్ మరణం ఈ దేశానికి తీరని లోటు అన్నారు. మన్మోహన్ సింగ్ గౌరవానికి భంగం కలగకుండా వాజ్ పేయి తరహాలోనే మన్మోహన్ కు అంత్యక్రియలు నిర్వహించామన్నారు. మన్మోహన్ స్మారక చిహ్నం ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించిందన్నారు. సొంత పార్టీ నాయకులను కూడా గౌరవించుకోలేని వక్రబుద్ధి కాంగ్రెస్ దని అలాంటి పార్టీ బీజేపీపై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు.
రాహుల్ గాంధీకి ఆ నైతిక హక్కు ఎక్కడిది?:
మన్మోహన్ సింగ్ హయాలంలో కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఓ ఆర్డినెన్స్ విషయంలో ప్రధానిని బక్వాస్ అని అన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. మన్మోహన్ తమ కనుసన్నల్లో వ్యవహరించేలా రాహుల్, సోనియా వ్యవహరించారని దుయ్యబట్టారు. రాహుల్ ప్రతీ విషయాన్ని రాజకీయం చేయాలని చూడటం, బోర్లా పడటం పరిపాటి అయిపోయిందని విమర్శించారు. మన్మోహన్ ను పాక్ ప్రధాని విమర్శిస్తే.. మోడీ, అద్వానీ స్పందించారు కానీ కాంగ్రెస్ రియాక్ట్ కాలేదు. ప్రధానిగా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాడు 10 జన్ పద్ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన వింధును రాహుల్ గాంధీ ఎందుకు బహిష్కరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు (PV) విషయంలో కాంగ్రెస్ ఎలా వ్యవహరించిందో అందరికి తెలుసని కాంగ్రెస్ పార్టీలో సాధారణ నాయకులకు దక్కిన గౌరవం కూడా పీవీకి దక్కకుండా తెలుగు బిడ్డను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. సొంత పార్టీ నాయకులను కూడా గౌరవించుకోలేని వక్రబుద్ధి కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు.






