CPI ఎమ్మెల్యే కూనంనేనిపై చర్యలు తీసుకోండి.. స్పీకర్‌కు కిషన్ రెడ్డి విజ్ఞప్తి

by Gantepaka Srikanth |

ప్రధాని నరేంద్ర మోడీపై కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో తీవ్ర దుమారానికి దారితీశాయి.

CPI ఎమ్మెల్యే కూనంనేనిపై చర్యలు తీసుకోండి.. స్పీకర్‌కు కిషన్ రెడ్డి విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరు మార్పుపై జరిగిన చర్చ సందర్భంగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారానికి దారితీశాయి. ఉపాధి హామీ పథకం వంటి పేదల సంక్షేమ పథకాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ.. ప్రధాని తన మనస్తత్వాన్ని (Mindset) మార్చుకోవాలని కూనంనేని వ్యాఖ్యానించారు. “మైండ్‌ను టెస్ట్ చేయించాలంటూ” చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా ఈ అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. కూనంనేని సాంబశివ రావు వ్యాఖ్యలను ఖండించారు. సభ ఉన్నది రాజకీయ చర్చకే కానీ.. వ్యక్తిగత దూషణలకు కాదని హితవు పలికారు. ప్రధాని మోడీకి కూనంనేని క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే కూనంనేని సాంబశివ రావుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్యలు తీసుకోవాలని కోరారు.

కాగా, కూనంనేని వ్యాఖ్యలపై నిన్న సభలోనూ గందరగోళం నెలకొంది. కూనంనేని సాంబశివరావు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తక్షణమే తొలగించాలని వారు పట్టుబట్టారు.

Next Story