కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన కిషన్ రెడ్డి.. కానీ ఓ కండిషన్

by Gantepaka Srikanth |

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు తెలంగాణ ఒక్క బీజేపీ(Telangana BJP)కే ఉందని కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన కిషన్ రెడ్డి.. కానీ ఓ కండిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు తెలంగాణ ఒక్క బీజేపీ(Telangana BJP)కే ఉందని కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం(Central Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకాలన్నీ అమలు చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చిందని విమర్శించారు. గత 7 నెలలుగా జీహెచ్‌ఎంసీలో వీధిలైట్లకు నిధుల కొరత ఉందని అన్నారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే కేసీఆర్(KCR) అప్పుల కుప్పగా మార్చారు.. ప్రస్తుతం ఆ ఒరవడిని కాంగ్రెస్ కొనసాగిస్తోందని మండిపడ్డారు. చెరువుల కబ్జాను అరికట్టే చట్టం గతంలో కూడా ఉండేదని గుర్తుచేశారు.

ఆ పాత చట్టానికే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) హైడ్రా(Hydra) అని పేరు పెట్టిందని విమర్శించారు. నగరంలో మెట్రో రెండో దశకు కేంద్రప్రభుత్వం తప్పకుండా సాయం చేస్తుందని.. అది తమ బాధ్యత అని అన్నారు. అంతేకాదు.. ఎంఐఎం పార్టీ(MIM Party)పై కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆ పార్టీతో జట్టు కడుతుందని ఎద్దేవా చేశారు. ప్రత్యేకంగా ఒక సిద్ధాంతం అంటూ ఎంఐఎం పార్టీకి ఏమీ ఉండదని అన్నారు. రాష్ట్రంలో మూసీ సుందరీకరణ(Musi Project) చేయాల్సిందే అని ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. కానీ పేదల ఇళ్లు కూల్చకుండా పని పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

Next Story