- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kishan Reddy: రాహుల్ గాంధీ నుంచి ఆశించి ఉపయోగం లేదు
రాష్ట్రం నుంచి ఆర్ఆర్ట్యాక్స్ట్యాక్స్ వసూలు చేసుకోవడానికే పక్కా ప్లాన్‌తోనే రాహుల్ గాంధీ తెలంగాణ వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం నుంచి ఆర్ఆర్ట్యాక్స్ట్యాక్స్ వసూలు చేసుకోవడానికే పక్కా ప్లాన్‌తోనే రాహుల్ గాంధీ తెలంగాణ వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ ఆయనకు తెలంగాణ ప్రజల సమస్యలపై కనీస అవగాహన, ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి వచ్చిన వెంటనే మొదట వాటి అమలుపై సమీక్షించేవారని అభిప్రాయ పడ్డారు. హామీలు ఎలా అమలు అవుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేసేవారు. కానీ ఇసుమంతైనా జవాబుదారీతనం లేని రాహుల్ గాంధీ నుంచి ఇలాంటివి ఆశించడం తెలంగాణ ప్రజల దురదృష్టకరమన్నారు. తెలంగాణ పర్యటనలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలపై యువనేత ఊసెత్తలేదని మండిపడ్డారు. వారికి మతిమరుపు ఉందేమో కానీ తెలంగాణ ప్రజలకు లేదనే విషయాన్ని రాహుల్ గాంధీ గ్రహించాలి. ఎన్నికలప్పుడు అనేక హామీలిచ్చి గెలిచాక ముఖం చాటేసిన కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.






