దమ్ముంటే ఆ పథకం ఆపి చూపియాలి.. CM రేవంత్‌కు కిషన్ రెడ్డి సవాల్

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దమ్ముంటే ఆ పథకం ఆపి చూపియాలి.. CM రేవంత్‌కు కిషన్ రెడ్డి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీని విమర్శించి మజ్లిస్ ఓట్లు పొందాలని కాంగ్రెస్ కొత్త కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు. సన్నబియ్యం రద్దు చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరించడం సరికాదు.. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. అమలుకు సాధ్యం కానీ హామీలు గుప్పించి.. దొడ్డి దారిన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. హామీలన్నీ విస్మరించి ఒకే ఒక్క హామీని అమలు చేస్తున్నారు.. అదే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని అన్నారు.

సన్నబియ్యం పథకం కాంగ్రెస్‌ది కాదని.. సీఎంకు దమ్ముంటే ఆ పథకం ఆపి చూపియమనండి అని సవాల్ చేశారు. సన్నబియ్యంపై కేజీకి కేంద్రమే రూ.42 ఇస్తోంది.. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది కేవలం రూ.15 మాత్రమే అని అని అన్నారు. సన్నబియ్యం పథకం ఎవరిదో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. ఓటు వేయకపోతే పథకం ఆపేస్తామని సీఎం రేవంత్ బెదిరింపులకు దిగడంపై బీజేపీ తరపున ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు.

Next Story