ఈ దిగజారుడు మాటలొద్దు.. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి కౌంటర్

by Prasad Jukanti |

మెట్రో సెకండ్ ఫేజ్ కు తాను అడ్డు పడుతున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

ఈ దిగజారుడు మాటలొద్దు.. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అడ్డుపడుతున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి ఖండించారు. రేవంత్ రెడ్డివి దిగజారుడు మాటలని ఆయన నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మెట్రో రైలు అంశంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. దేశవ్యాప్తంగా మిగతా మెట్రోల మాదిరిగానే హైదరాబాద్ మెట్రోకు కేంద్రం సహకారం అందిస్తోందని, సాంకేతిక, ఆర్థిక విషయాలు చర్చించి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే సాకరమవుతాన్నారు. అంతే తప్ప కిషన్ రెడ్డి వద్దంటే ప్రాజెక్టులు ఎక్కడా ఆగవన్నారు.

రేవంత్ సర్టిఫికెట్ మాకక్కర్లేదు:

అనాలోచితంగా, దుందుడుకుగా సీఎం మాట్లాడటం సమంజసం కాదని తెలంగాణ అభివృద్ధి పట్ల మాకు చిత్తశుద్ధి ఉందన్నారు. ప్రధాని మోడీకి, నాకు, కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సర్టిఫికేట్ అవసరం లేదన్నారు. మేము రేవంత్ రెడ్డికి జవాబుదారీ కాదని తెలంగాణ ప్రజలకు జవాబుదారీ అని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం 12 ఏళ్లుగా పని చేశాం.. ఇప్పుడూ పని చేస్తామన్నారు. తెలంగాణ బిడ్డగా, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశాను. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఢిల్లీకి వచ్చి రెండు సార్లు ధర్నా చేశాం. బిల్లు ఆమోదం పొందిన తర్వాతే ఏపీ భవన్ లో ఆమరణ దీక్ష విరమించానన్నారు. గతంలో మెట్రో ఫేజ్-1 కు కేంద్రం రూ. 1250 కోట్లు ఇచ్చిందన్నారు.

మాకు పాఠాలు నేర్పకండి:

తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ది పట్ల మాకెవరూ పాఠాలు చెప్పనక్కర్లేదని రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం నాడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డికి లేఖలు రాశానని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి కోరితే రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు చేపట్టలేదని, కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్-2 కోసం కేసీఆర్ సహకరించలేదు. కేసీఆర్ సహకరించకపోయినా ప్రధాని చేతులమీదుగా ఫేజ్-2చ ప్రారంభించామన్నారు. తెలంగాణకు రాదనుకున్న రైల్వే ఫ్యాక్టరీని సాధించామన్నారు. ఏ పార్టీలు ప్రభుత్వతాలు ఉన్నా అన్ని రాష్ట్రాలకు కేంద్రం సహకారం అందిస్తోందన్నారు. మోడీ ఇస్తుంటే కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారనడం దిగజారుడు రాజకీయాలేనన్నారు. 50 ఏళ్లు వడ్డీ లేకుండా ఇటీవల సాస్కీ రుణాలను కేంద్రం ఇచ్చిందన్నారు. మూసీ పునరుజ్జీవం కోసం ఏడీబీ రుణానికి కేంద్రం ఎన్ వోసీ ఇచ్చింది. ఎన్ సీడీసీ ద్వారా పదేళ్లుగా తెలంగాణకు రూ.లక్ష కోట్లు మంజూరు అయ్యాయన్నారు. ధాన్యం కొనుగోళ్లకు రూ. 37 వేల కోట్లను ఎన్‍సీడీసీ ద్వారా మంజూరు ఇప్పటికే రూ.34 వేల కోట్లు ఎన్ సీడీసీ తెలంగాణకు అందించిదన్నారు.

Next Story