టీ కాంగ్రెస్‌కు​ ముస్లిం లీగ్​ కాంగ్రెస్​ పేరు సరిగా సరిపోతుంది: కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

by Ajay Maddhiboyina |

ముస్లిం లీగ్ కాంగ్రెస్‌ పేరుకు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ సరిగా సరిపోతుందని, గతంలో అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి ‘కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్’ అని పేర్కొనట్లు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి గుర్తు చేశారు.

టీ కాంగ్రెస్‌కు​ ముస్లిం లీగ్​ కాంగ్రెస్​ పేరు సరిగా సరిపోతుంది: కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముస్లిం లీగ్ కాంగ్రెస్‌ పేరుకు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ సరిగా సరిపోతుందని, గతంలో అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి ‘కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్’ అని పేర్కొనట్లు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి గుర్తు చేశారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ శాశ్వతంగా ఉండేలా చూడడానికి అవసరమైన పత్రాలను సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని నిజామాబాద్​సభలో అనడం నిదర్శమన్నారు. శుక్రవారం ఎక్స్​వేదిక స్పందిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ముస్లిం రిజర్వేషన్లను ప్రవేశపెట్టిన సందర్భంలో హైకోర్టు వాటిని రెండుసార్లు కొట్టివేసి, అటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, చెల్లవని ప్రకటించింది.

అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లి, స్టే పొంది, వాటిని అమలు చేస్తోందని మండిపడ్డారు. కుల సర్వే ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఒక సర్వేను నిర్వహించి తెలంగాణలో బీసీ జనాభాను పెద్దమొత్తంలో తగ్గించడానికి ప్రయత్నించింది. జనాభాలో నిజమైన బీసీలు 46 శాతం ఉన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ 10 శాతం ముస్లింలను కూడా బీసీలలో చేర్చి రాష్ట్ర జనాభాలో బీసీలు 56 శాతం ఉన్నారని పేర్కొంది. బీసీలు, ముస్లింలకు కలిపి, వారు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లను కేటాయించారు. ఇందులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత, బీసీలకు ప్రస్తుతం ఉన్న 34 శాతం కోటా 32 శాతానికి తగ్గుతుంది. కోర్టు ఈ ఉత్తర్వులను నిలుపుదల చేయకపోతే, బీసీ సమాజం తీవ్రంగా నష్టపోయేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story