- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు అడ్డుకునేందుకు సోనియా, రాహుల్ కుట్రలు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
అంతర్జాతీయ వాణిజ్య రవాణా కోసం కేంద్రం రూ. 80 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు చేపడితే ముందుకు వెళ్ళకుండా అంతర్జాతీయ కుట్రదారులతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలు చేతులు కలిపారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : అంతర్జాతీయ వాణిజ్య రవాణా కోసం కేంద్రం రూ. 80 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు చేపడితే ముందుకు వెళ్ళకుండా అంతర్జాతీయ కుట్రదారులతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలు చేతులు కలిపారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ట్రాన్స్‌షిప్‌మెంట్‌లో ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టును ఇబ్బంది పెట్టడానికి, ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సోనియా గాంధీ గతంలో ఓ ఆంగ్ల పత్రికలో పూర్తి అబద్ధాలతో వాస్తవాలను వక్రీకరించారని మండిపడ్డారు. సోనియాగాంధీ చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని తేల్చుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ కు పచ్చజెండా ఊపిందన్నారు.
బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ భారత భూభాగమైన నికోబార్ దీవుల్లో హిందూ మహాసముద్రం, పసిఫిక్ సముద్రాన్ని కలిపే అత్యంత కీలకమైన మలక్కా జలసంధి సమీపంలో ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. బంగాళాఖాతంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యూహాత్మక, ఆర్థిక, రవాణా హబ్‌గా అత్యంత కీలకమైన ఒక వాణిజ్య కేంద్రంగా తయారు చేయాలని ఈ ప్రాజెక్ట్ ను నిర్మించాలని లక్ష్యంగా మోడీ సర్కార్ పెట్టుకుంది. భారతదేశం ప్రస్తుతం ట్రాన్స్‌షిప్‌మెంట్ కోసం విదేశీ ఓడరేవులపై ఎక్కువగా ఆధారపడుతోంది. దీనిని కాస్త తగ్గించుకోవడానికి మలక్కా జలసంధికి సమీపంలో అంతర్జాతీయ ట్రాన్స్‌షిప్‌మెంట్ టెర్మినల్, అంతర్జాతీయ విమానాశ్రయం, విద్యుత్ ప్లాంట్, టౌన్‌షిప్‌ను నిర్మించడం ద్వారా ఈ ప్రాంతంపై పట్టుసాధించుకోవాలనుకుంటుందన్నారు.
భారత్ వస్తు రవాణా కోసం విదేశీ ఓడరేవులపై ఎక్కువగా ఆధారపడుతుండటంతో గ్రేట్ నికోబార్ మెగా ఇన్‌ఫ్రా ప్రాజెక్టు ఎంతో మనకెంతో ఉపయోగ పడుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ కు అడ్డంకులు సృష్టించేందుకు అంతర్జాతీయంగా, మన దేశంలోనూ చాలామంది ప్రయత్నించారని విమర్శించారు. ఒక వైపు ప్రధాని మోడీ వికసిత్ భారత్‌ను నిర్మించడానికి తన జీవితాన్ని అంకితం చేస్తుంటే, మరోవైపు చాలా మంది భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో అడ్డంకులు సృష్టించడానికి కృషి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. భారతదేశాన్ని, దేశ పురోగతిని వ్యతిరేకించే వారి కుట్రలు కుతంత్రాలు నెరవేరవని వీరి దుష్టబుద్ధి ప్రజలకు అర్థమైందన్నారు.






