- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇప్పటివరకు ఎక్కడ ముస్లింలను అవమానించలేదు.. కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
గ్రేటర్హైదరాబాద్లోజరిగిన అభివృద్దిపై తాను బీఆర్‌ఎస్‌నేత కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధంగా ఉన్నానని స్థలం, సమయం వారే చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్‌విసిరారు. తన వద్ద నగరంలో ఎవరి పాలనలో అభివృద్ది జరిగిందో తగిన ఆధారాలున్నాయని, వారికి చేతనైతే నా సవాల్‌ను స్వీకరించాలని పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్హైదరాబాద్లోజరిగిన అభివృద్దిపై తాను బీఆర్‌ఎస్‌నేత కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధంగా ఉన్నానని స్థలం, సమయం వారే చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్‌విసిరారు. తన వద్ద నగరంలో ఎవరి పాలనలో అభివృద్ది జరిగిందో తగిన ఆధారాలున్నాయని, వారికి చేతనైతే నా సవాల్‌ను స్వీకరించాలని పేర్కొన్నారు. శనివారం పార్టీ రాష్ర్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నేను ఏ ప్రాజెక్టును అడ్డుకున్నానో వారు చెప్పాలి , దీనిపై చర్చకు వారు సిద్ధమా అంటూ నిలదీశారు. ఎప్పడు మత రాజకీయాలు చేయలేదు ఎక్కడ ముస్లింలను అవమానించలేదని స్పష్టం చేశారు. అన్ని పార్టీలు తిరిగిన రేవంత్ రెడ్డిలా తాను తిరగనని ఒక్కటే పార్టీలో ఉన్నాను, బీజేపీలో పుట్టాను, ఇక్కడే చివరి శ్వాస వరకు పని చేస్తానని చనిపోయినప్పుడు కాషాయం జెండానే కప్పుకుంటానని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతో ముఖ్యమంత్రి సోయి తప్పి మాట్లాడుతున్నాడని ప్రజల్లోకి వెళ్లేటప్పుడు తాను ఏమి చేశానో వివరించి, ఆ తర్వాత ప్రత్యర్థిని విమర్శిస్తూ ఓట్లు అడగాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన హామీలు ఏమాత్రం ఉన్నాయో ఒక్క మాట మాట్లాడలేదన్నారు. కేవలం రెండు నెలల్లో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా, ప్రత్యర్థిపై విమర్శలు మాత్రమే చేస్తున్నాడు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మళ్లించే వ్యూహంలో భాగంగానే బీజేపీ, ప్రధాని మోడీపై తప్పుడు విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. బీజేపీ అంటే కిషన్ రెడ్డి అంటే ఏమిటో దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తెలుసునని మాది కుటుంబ పార్టీ కాదన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పార్టీ తమదని మోడీ నాయకత్వంలో ఒక్క చిన్న అవినీతి ఆరోపణ కూడా లేకుండా పనిచేస్తున్న పార్టీ బీజేపీ ఒకటే అన్నారు.గత ఎన్నికల్లో ఫేక్ వీడియోలు తయారు చేసి ప్రచారం చేసిన పార్టీ కాంగ్రెస్ , బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్‌లో కూడా అదే పరిస్థితి. లక్ష కోట్ల అవినీతి డబ్బులు కక్కిస్తానన్న రాహుల్ గాంధీ లక్ష రూపాయలను కూడా బయటకు తీయలేదని ఎద్దేవా చేశారు.
ఢిల్లీ స్థాయిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిన మాట వాస్తవం కాదా, కేటీఆర్ సోషల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, కేజ్రీవాల్‌ను కలుపుకొని పోరాటం చేయాలన్నది నిజం కాదా మరి ఏ విధంగా బీజేపీకి, బీఆర్‌ఎస్‌కు సంబంధం అంటగడుతున్నారని నిలదీశారు. ఆరు గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. ఆరు గ్యారంటీలు, 420 సబ్-గ్యారంటీలతో మోసం చేసిన పార్టీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీకి ఎలాంటి తేడా లేదన్నారు. కాంట్రాక్టుల దగ్గర, రియల్ ఎస్టేట్ పరిశ్రమల దగ్గర వేలాది రూపాయలు వసూలు చేసి బీహార్ ఎన్నికలకు ఆ డబ్బు పంపిస్తున్నారని ఆరోపించారు.రేవంత్, కేసీఆర్ తో పాటు మూడో బ్యాడ్ బ్రదర్ అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడని, కేసీఆర్, అసదుద్దీన్, సోనియా కుటుంబం తెలంగాణ పాలిట బ్యాడ్ బ్రదర్స్' గా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మజ్లీస్ పార్టీతో తప్ప అన్ని పార్టీలలో పనిచేశాడు. ఆ అనుభవంతోనే అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని, పార్టీలు మార్చే బుద్ధి మాకు లేదు. మంత్రులు తమ శాఖలు మర్చి, పాలనను వదిలేసి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తిరుగుతూ డబ్బులు పంచుతున్నారు. అంగట్లో సరుకు కొన్నట్లుగా ఓట్లు కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు.






