- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ కృషి వల్లే హైదరాబాద్‌కు కంపెనీలు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
మోడీ (MODI) చేస్తున్న కృషి వల్లనే హైదరాబాద్‌కు పరిశ్రమలు వస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (KISHAN REDDY) అన్నారు.

దిశ,వెబ్ డెస్క్: మోడీ (MODI) చేస్తున్న కృషి వల్లనే హైదరాబాద్‌కు పరిశ్రమలు వస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (KISHAN REDDY) అన్నారు. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ ఒక్కటే కాదని అంబర్‌పేట, నాంపల్లి, ఖైరతాబాద్ కూడా నగరంలో భాగమేనని చెప్పారు. బీఆర్ఎస్ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్న ప్రాంతంలోనే అభివృద్ధి చేసిందని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే నగరం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. బేగంపేటలో ఎమ్మెల్సీ ఎన్నికపై నిర్వహించిన బీజేపీ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ (CONGRESS) ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. మజ్లిస్‌కు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుందని తమ పార్టీని ఓడించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పనిచేస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ కనుసన్నల్లో ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికలో ఎందుకు పోటీ చేయడం లేదో రాహుల్ గాంధీ చెప్పాలని అన్నారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు ఎందుకు పోటీ చేయడం లేదని నిలదీశారు.






