- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనగణనలో భాగంగా కులగణన చేపట్టం హర్షనీయం: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆయా రాష్ట్రాలు కులగణన పేరుతో వారికి అనుకూలంగా సర్వేలు చేపట్టి ప్రజల్లో ఆందోళనలు కలిగించాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆయా రాష్ట్రాలు కులగణన పేరుతో వారికి అనుకూలంగా సర్వేలు చేపట్టి ప్రజల్లో ఆందోళనలు కలిగించాయి. ప్రజాభిప్రాయం మేరకు, సామాజిక సమరసతను దృష్టిలో ఉంచుకుని జనగణనలో భాగంగా కులగణన చేయాలని నిర్ణయించడం మంచి పరిణామం అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి రెండేళ్లపాటు ఈ సర్వే జరగనుంది. 1881 నుంచి 1931 కులగణన జరిగేదని స్వాతంత్ర్యానంతరం కులగణన జరగకూడదని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం 1951 నుంచి నేటివరకు ఏనాడూ కులగణన జరగలేదు. 1951లో జరిగిన కులగణనలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన గణాంకాలను మాత్రమే లెక్కించారు. ఈ రెండు కులాలు అత్యంత వెనుకబడి ఉన్న కారణంగా వీరి పురోగతి కోసం కులగణన అవసరమని నిర్ణయించారు. మొదటినుంచీ కాంగ్రెస్ పార్టీ కులగణనకు వ్యతిరేకంగానే ఉంది. నెహ్రూ, మౌలానా ఆజాద్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కులగణన పట్ల బహిరంగంగానే విముఖత వ్యక్తం చేశారని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం సడన్ గా తీసుకున్న నిర్ణయం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కులగణనపై సరైన సమయంలో అందరికీ తెలియజేస్తామని చెప్పారు. తదనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం వెల్లడించింది.
మోడీ ప్రభుత్వ చారిత్రాత్మక కుల గణన నిర్ణయం తీసుకుంది : ఎంపీ లక్ష్మణ్
ప్రధాన మంత్రి మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కుల గణనను రాబోయే జనగణనలో చేర్చాలని తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఇది సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి, దేశ సామాజిక బలాన్ని బలోపేతం చేసే దిశగా గొప్ప ముందడుగు అన్నారు. 94 ఏళ్ల తర్వాత మోడీ ప్రభుత్వం ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించడం పారదర్శక పాలనకు, నిదర్శనమన్నారు. కుల గణనపై కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాల ద్వంద్వ వైఖరిని ప్రజలకు తెలియజేయడం అవసరం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తరచుగా కుల గణనను రాజకీయ నినాదంగా వాడిందని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయి కుల గణన చేపట్టడంలో విఫలమైంది. 2010లో యుపిఏ హయాంలో కేవలం సర్వే మాత్రమే నిర్వహించి, సేకరించిన డేటాను పూర్తిగా విడుదల చేయలేదు. పారదర్శకత లేకుండా వ్యవహరించారని ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలూ దేశ నిర్మాణ దృక్పథంతో ఈ నిర్ణయానికి మద్దతివ్వాలని కోరారు.






