కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దెబ్బ తీశారు: కిషన్ రెడ్డి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-22 14:34:43  IST  )

కుటుంబ పాల‌న‌తో తెలంగాణ రాష్ట్రాన్ని దెబ్బతీశారని కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి విమ‌ర్శించారు. ధ‌నిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ల‌క్ష‌ల కోట్లు అప్పు అయ్యింద‌ని అన్నారు.

కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దెబ్బ తీశారు: కిషన్ రెడ్డి
X

దిశ‌, వెబ్ డెస్క్: కుటుంబ పాల‌న‌తో తెలంగాణ రాష్ట్రాన్ని దెబ్బతీశారని కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి విమ‌ర్శించారు. ధ‌నిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ల‌క్ష‌ల కోట్లు అప్పు అయ్యింద‌ని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ‌ను తెచ్చుకుంటే ఒక కుటుంబం బారిన‌ప‌డి బ‌లి అయ్యింద‌ని మండిప‌డ్డారు. అవినీతి పాల‌న‌తో, దోపిడితో, కుటుంబ పాల‌న‌తో, అహంకారంతో రాష్ట్రాన్ని దెబ్బ‌తీశారని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు విరుద్దంగా బీఆర్ఎస్ ఎలా ప‌నిచేసిందో మ‌న‌మంతా చూశామ‌ని అన్నారు. కాంగ్రెస్ ను న‌మ్మి ఓటేస్తే ఆ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని వ‌మ్ముచేసింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతులు, యువ‌కులు, ద‌ళితులు, నిరుద్యోగుల‌కు డిక్ల‌రేష‌న్ల పేరుతో అనేక హామీలు ఇచ్చి మోసం చేశార‌ని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అప్పులు ఇచ్చేవారు లేర‌ని, త‌న‌ను న‌మ్మేవాళ్లు లేర‌ని చేతులు ఎత్తేశాడ‌ని ఎద్దేవా చేశారు. హామీలు అమ‌లు చేయ‌లేక‌, ప‌రిపాల‌న చేత‌కాక కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాష్ట్రంలో చేతులు ఎత్తేసింద‌ని ఎద్దేవా చేశారు.

Next Story