- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతా మీ ఇష్టమా?.. తెలంగాణ బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి క్లాస్
తెలంగాణ బీజేపీ(Telangana BJP) నేతలకు కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) క్లాస్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP) నేతలకు కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) క్లాస్ ఇచ్చారు. బుధవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం(BJP State Office)లో ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎవరికి వాళ్లు ప్రెస్‌మీట్‌లు పెట్టి ఇష్టారీతిన మాట్లాడొద్దు అని హితవు పలికారు. పార్టీ కార్యాలయంలో పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ వేదికపై వ్యక్తిగత అజెండాతో మాట్లాడొద్దు అని సూచించారు. పార్టీ అజెండానే.. నేతలు, లీడర్ల అజెండా అయ్యి ఉండాలని తెలిపారు. అలా కాకుండా.. ఎవరికి వారు.. ఆఫీస్‌కు వచ్చి ప్రెస్‌మీట్‌లు పెట్టి.. వ్యక్తిగత దూషణలు చేయకూడదు. ఇకపై పార్టీ కార్యాలయాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకున్న వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని అన్నారు. ఇది తనతో పాటు అందరికీ వర్తిస్తుందని చెప్పారు. బీజేపీ అంటే.. బాధ్యతగల పార్టీ అని.. సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన పార్టీ అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా పార్టీ ఆఫీస్‌ను ఆశ్రయిస్తున్నారని.. అలాంటి వారికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేసేలా నాయకుల తీరు ఉండాలని అన్నారు.






