భారత్ విక్టరీని ఎక్కడ జరుపుకోవాలి? లాఠీఛార్జ్‌పై నెటిజన్లు, కేంద్ర మంత్రులు గుస్స

by Ramesh Naini |

ఫైనల్లో భారత జట్టు గెలవడంతో హైదరాబాద్‌ సహా కరీంనగర్లో రోడ్లపైకి వచ్చి నిన్న రాత్రి సంబరాలు చేసుకున్నారు.

భారత్ విక్టరీని ఎక్కడ జరుపుకోవాలి? లాఠీఛార్జ్‌పై నెటిజన్లు, కేంద్ర మంత్రులు గుస్స
X

దిశ, డైనమిక్ బ్యూరో: దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు గెలవడంతో హైదరాబాద్‌ సహా కరీంనగర్‌లో రోడ్లపైకి వచ్చి నిన్న రాత్రి యువత సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో క్రికెట్ అభిమానుల మీద పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని, మరోవైపు ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు యువతను పోలీసులు చెదరగొట్టినట్లు సమాచారం. ఈ లాఠీఛార్జ్ ఘటనలపై వీడియోలు వైరల్ కావడంతో (netizens) నెటిజన్లు, (Union ministers) కేంద్ర మంత్రులు, బీజేపీ (BJP) నేతలు గుస్సా అయ్యారు. భారతదేశ విజయాన్ని భారతీయులు ఎక్కడ జరుపుకోవాలి? అని నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అలాగే కరీంనగర్ పోలీసులు ఏ దేశానికి మద్దతు ఇస్తున్నారు? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఎక్స్ వేదికగా స్పందించారు. భారత విజయాన్ని మనం జరుపుకోలేము.. కానీ పాకిస్తాన్ పేరుతో ఉన్న ఫ్లెక్సీని తొలగిస్తారా? ఫైర్ అయ్యారు. భారత విజయాన్ని జరుపుకోవడం "మతపరమైన సమస్య"గా ఎలా మారుతుంది? అని ప్రశ్నించారు. శాంతిభద్రతల సమస్యలను సృష్టించడానికి ఎందుకు అంత ఆసక్తిగా ఉన్నారో తెలంగాణ పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విజయోత్సవాలను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం సిగ్గు చేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు.

Next Story