కర్ణాటక ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం.. తొక్కిసలాటపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

బెంగళూరు(Bengaluru)లోని చిన్నస్వామి మైదానం(Chinnaswamy Stadium) వేదికగా జరిగిన తొక్కిసలాట ఘటనపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy), మరో కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు.

కర్ణాటక ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం.. తొక్కిసలాటపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు(Bengaluru)లోని చిన్నస్వామి మైదానం(Chinnaswamy Stadium) వేదికగా జరిగిన తొక్కిసలాట ఘటనపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy), మరో కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. తొక్కిసలాట జరగడం చాలా దురదృష్టకరం అన్నారు. ఈ ఘటనకు కర్ణాటక ప్రభుత్వం, బెంగళూరు పోలీసులే కారణమని ఆరోపించారు. అభిమానులను నియంత్రించలేకపోయామని ప్రకటించడం సీఎం సిద్ధరామయ్య, డీప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేతకానితనానికి నిదర్శనం అని విమర్శించారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. కాగా, ఈ ఘటనలో మొత్తం 11 మంది మృతి చెందగా, 50 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌.. ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. తొక్కిసలాట ఘటనతో ఆర్సీబీ(RCB) క్రీడాకారులకు సన్మాన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. చిన్నస్వామి స్టేడియంవైపు వెళ్లే మెట్రో, ఇతర వాహనాలను నిలిపివేశారు.

Next Story