- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kishan Reddy: బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్‌కు భయపడా.. సీఎంపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్‌కు తాను భయపడే వ్యక్తిని కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Kishan Reddy)పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్‌కు తాను భయపడే వ్యక్తిని కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Kishan Reddy) పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే, మాజీ సీఎం కేసీఆర్ (KCR)కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బిజినెస్ పార్ట్‌నర్స్ అంటూ ఇటీవలే సీఎం రేవంత్ కామెంట్ చేశారు. అదేవిధంగా కేసీఆర్ (KCR) కోసమే కిషన్ రెడ్డి పని చేస్తున్నారని.. మెట్రో సహా ఇతర ప్రాజెక్టులను పూర్తి చేస్తే తనకు పేరుస్తుందనే కేంద్ర కేబినెట్ అడ్డుకుంటున్నారని మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ అన్నారు. తాజాగా, ఆ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ (Telangana)కు సీఎం రేవంతా లేకపోతే నేనా అని ప్రశ్నించారు. కేంద్రాన్ని అడిగి పోయిన ఎన్నికల్లో హామీలు ఇచ్చారా అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి గాలి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ (Blackmailing)కు తాను భయపడే వ్యక్తిని కాదని కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను అడ్డుకున్నట్లుగా నిరూపించే దమ్ము రేవంత్‌కు ఉందా అని సవాల్ విసిరారు. హైదరాబాద్ (Hyderabad)లో మెట్రో విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వద్ద నయాపైసా లేదని కానీ నెపం నాపై నెడుతున్నారని ఆరోపించారు. రేవంత్ సీఎం కావడం తెలంగాణ ప్రజల దురదృష్టమని కిషన్ రెడ్డి అన్నారు.






