బీరులో సోంపు ప్యాకెట్..రెచ్చిపోయిన మందుబాబు !

by velandi.Saikiran |

కింగ్ ఫిషర్ బీరులో ( Beer ) ఏకంగా సోంపు ప్యాకెట్ ప్రత్యక్షమైంది

బీరులో సోంపు ప్యాకెట్..రెచ్చిపోయిన మందుబాబు !
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో మందు బాబులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. పీకలదాకా తాగి రోడ్లపై పడుకోవడం, లేదా తాగి వాహనాలు నడపడం లాంటివి చేస్తూ రచ్చ చేస్తున్నారు మందుబాబులు. ఇక అప్పుడప్పుడు మందుబాబులు తాగే బీర్లలో రకరకాల కీటకాలు కూడా ప్రత్యక్షమవుతున్నాయి. మొన్నటికి మొన్న జెర్రీ ప్రత్యక్షం కాగా, మరోసారి కొన్ని విషపూరిత కీటకాలు కూడా దర్శనమిచ్చాయి.

ఇక తాజాగా కింగ్ ఫిషర్ బీరులో ( Beer ) ఏకంగా సోంపు ప్యాకెట్ ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందులో కింగ్ ఫిషర్ బీర్ తీసుకున్నాడు ఓ మందు బాబు. ఇక ఇంటికి వెళ్లి తాగే సమయానికి అందులో సోంపు ప్యాకెట్ ( Soamp Packet) ప్రత్యక్షమైంది.

దీంతో వెంటనే ఆ బీరు తీసుకువచ్చి... వైన్ షాప్ ముందు రచ్చ చేశాడు ఆ మందు బాబు. దీంతో ఆ బీర్ బాటిల్ వెనక్కి తీసుకొని మరో బీర్ ఇచ్చింది యాజమాన్యం. అయితే బీర్ ఫ్యాక్టరీలో... అక్కడి కార్మికుల నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన జరిగినట్లు చెబుతున్నారు అధికారులు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. క్లిక్

Next Story