- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరీష్ రావు చేసిన ఆరోపణల్లో నిజం లేదు : కింగ్ కోఠి హాస్పిటల్ సూపరింటెండెంట్
by Muthe.Rajitha |
కింగ్ కోఠి హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన పిల్లలకు అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ చేయడం లేదంటూ బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలను హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్ సంతోష్ బాబు ఖండించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : కింగ్ కోఠి హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన పిల్లలకు అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ చేయడం లేదంటూ బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలను హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్ సంతోష్ బాబు ఖండించారు. పిల్లలకు చేసిన స్కానింగ్ రిపోర్టులను ఆయన ప్రదర్శించారు. ఫుడ్ పాయిజన్‌తో అడ్మిట్ అయిన పిల్లలందరూ స్టేబుల్‌గా ఉన్నారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. లక్షల మందికి సేవలు అందిస్తున్న హాస్పిటల్‌పై తప్పుడు ఆరోపణలు చేయొద్దని సూపరింటెండెంట్ విజ్ఞప్తి చేశారు. కింగ్ కోఠి హాస్పిటల్‌లో 2 అల్ట్రాసౌండ్ మిషన్లు, ఒక సీటీ స్కాన్ యంత్రం ఉందని.. అన్నీ వర్కింగ్ కండీషన్‌లో ఉన్నాయని తెలిపారు. నిత్యం సుమారు వంద మందికి స్కానింగ్ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
Next Story






