- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు.. ప్రధాని మోడీకి ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక రిక్వెస్ట్
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలపై గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలపై గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, పొరుగు దేశంలో హిందువుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో చంచల్ చంద్ర అనే వ్యక్తిని సజీవ దహనం చేసిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తన దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయనకు రిక్వెస్ట్ చేశారు.
‘ఒకప్పుడు బంగ్లాదేశ్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేది. అక్కడ నివసిస్తున్న ప్రతి హిందువు భారతీయుడే. బంగ్లాదేశ్‌లోని ప్రతి హిందువు ప్రాణాన్ని కాపాడటం ప్రధాన మంత్రి ప్రాథమిక బాధ్యత’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ‘భారతదేశం గనుక సహకరించకపోయి ఉంటే, పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయేది కాదు. మనం చేసిన సాయాన్ని మర్చిపోయి హిందువులపై దాడులు చేస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌ను దాని స్థానంలో ఉంచాల్సిన అవసరం ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.






