- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CPI Narayana : మావోయిస్టులను చంపినంత మాత్రాన సిద్ధాంతం చావదు : నారాయణ
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI National Secretary Narayana) మావోయిస్టుల(Maoists) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI National Secretary Narayana) మావోయిస్టుల(Maoists) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులను చంపినంత మాత్రాన వారి సిద్ధాంతం చావదని పేర్కొన్నారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్(Chhathisgahr)లోని అబుజ్‌మడ్ జరిగిన ఎన్‌కౌంటర్లో(Abujmad Encounter) మరణించిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించకుండా ప్రభుత్వం అంత్యక్రియలు(Funeral) నిర్వహించడం తప్పని మండిపడ్డారు. అలాగే మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌ల ద్వారా చంపడం లేదా అరెస్ట్‌ల ద్వారా అణచివేయడం వల్ల వారి సిద్ధాంతం(Maoism) అంతం కాదని స్పష్టం చేశారు.
మావోయిస్ట్ సిద్ధాంతం సామాజిక అసమానతలు, ఆర్థిక వివక్ష, మరియు అణచివేత వంటి సమస్యల నుండి ఉద్భవించింది. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే, సిద్ధాంతం జనంలో జీవించి ఉంటుందని ఆయన తెలియజేశారు. ప్రభుత్వం మావోయిస్ట్ ఉద్యమాన్ని కేవలం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూడకుండా, దాని వెనుక ఉన్న సామాజిక-ఆర్థిక కారణాలను అర్థం చేసుకొని పరిష్కరించాలని కోరారు.






