విష ప్రయోగంతో కుక్కలను హతమార్చడం క్రూరత్వానికి పరాకాష్ట

by Ratna Kumari |   (  Updated:2026-01-15 08:49:31  IST  )

కామారెడ్డి జిల్లా ఉమ్మడి మాచారెడ్డి మండలంలో చోటు చేసుకున్న కుక్కలపై విష ప్రయోగంతో సామూహిక మృతి ఘటనలపై సామాజిక కార్యకర్త మధుసూదన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి ఫిర్యాదు చేశారు.

విష ప్రయోగంతో కుక్కలను హతమార్చడం  క్రూరత్వానికి పరాకాష్ట
X

దిశ, మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా ఉమ్మడి మాచారెడ్డి మండలంలో చోటు చేసుకున్న కుక్కలపై విష ప్రయోగంతో సామూహిక మృతి ఘటనలపై సామాజిక కార్యకర్త మధుసూదన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో FIR No. 5/2026 గా నమోదై నప్పటికీ, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. విష ప్రయోగం తో వందల సంఖ్యలో కుక్కలకు చూపించడం క్రూరత్వానికి పరాకాష్టగా మారిందని, ఇది Prevention of Cruelty to Animals Act - 1960, Animal Birth Control నిబంధనలకు విరుద్ధమని ఆ ఫిర్యాదు లో వివరించారు. విష ప్రయోగం వల్ల ప్రజారోగ్యానికి కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ ఘటనపై అధికార యంత్రాంగం తగిన స్థాయిలో స్పందించలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన ఆదేశాలు జారీ చేయాలని మంత్రిని కోరినట్టు తెలిపారు.

Next Story