BREAKING: తెలంగాణ సీఎం ఎంపికపై మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన

by Disha Web Desk 19 |
BREAKING: తెలంగాణ సీఎం ఎంపికపై మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ ఎంపికపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి పదవికి సీనియర్లు పోటీ పడుతుండటంతో సీఎం అవుతారు అనే సస్పెన్స్ నెలకొంది. నూతన సీఎం ఎంపిక బాధ్యతను సోమవారం సీఎల్పీ హై కమాండ్‌కు అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రిని అధిష్టానం ఖరారు చేయనుంది. ఈ క్రమంలో తెలంగాణ నూతన సీఎం ఎంపికపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన చేశారు. ఇవాళే (మంగళవారం) సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తామని తెలిపారు. సాయంత్రం లోపు ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు సీఎం రేసులో ఉన్న టీ కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం మల్లికార్జున ఖర్గేతో వీరు భేటీ కానున్నారు. సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో తమ పేర్లను కూడా పరిశీలించాలని వీరు కోరనున్నట్లు సమాచారం. దీంతో తెలంగాణ నెక్ట్స్ సీఎం ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇవాళ సాయంత్రంతో సీఎం ఎవరూ అనే సస్పెన్స్‌కు తెరపడనుంది.

Next Story

Most Viewed