- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖర్గే సభ.. పార్టీ చరిత్రలోనే గొప్పది : మహేష్ కుమార్ గౌడ్
ఈనెల 4వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న సభ, కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే గొప్పదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఈనెల 4వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న సభ, కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే గొప్పదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీభవన్లో మంగళవారం మధ్యాహ్నం చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ నేతల సమావేశం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామ శాఖ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడడం చాలా ముఖ్యమైన అంశం అని పేర్కొన్నారు. అందరూ విధిగా సమావేశం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సందేశాన్ని ప్రజలకు చేరవేయాలని అన్నారు. ఎంపీ అనిల్ యాదవ్, చైర్మన్ ఫహీం ఖురేషి, చేవెళ్ల పార్లమెంటు ఇంచార్జ్ ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి, కె.ఎల్.ఆర్., ఉపాధ్యక్షులు బొంతు రామ్మోహన్, వేణు గౌడ్, చైర్మన్లు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.






