T Congress : కాంగ్రెస్ అసమ్మతి నేతలతో ఖర్గే భేటీ

by Muthe.Rajitha |

ఏఐసీసీ(AICC) అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikharjuna Kharge) గురువారం హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే.

T Congress : కాంగ్రెస్ అసమ్మతి నేతలతో ఖర్గే భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఏఐసీసీ(AICC) అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikharjuna Kharge) గురువారం హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని కాంగ్రెస్ లోని పలువురు అసమ్మతి నేతలు ఖర్గేతో భేటీ అయ్యారు. తాజ్ కృష్ణలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు(Prem Sagar Rao), మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, బాలూ నాయక్, సుదర్శన్ రెడ్డి, ఆది శ్రీనివాస్ తదితర నాయకులు ఖర్గేతో విడిగా మాట్లాడి, వారిని ఊరడించే ప్రయత్నం చేశారు.

అయితే ప్రేమ్ సాగర్ రావుకు ప్రభుత్వ విప్ పదవి ఇస్తామని తెలపగా.. ఆయన సమావేశం మధ్యలో నుంచే అలిగి వెళ్లిపోయారు. ఇక మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలకు తలా ఒక జిల్లాకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని, ఇచ్చిన జిల్లాకే మళ్ళీ మళ్ళీ ఇవ్వడం సరికాదని అన్నారు. మొత్తానికి కేబినెట్ విస్తరణలో చోటు దక్కని నేతలంతా అధిష్టానంపై ఇంకా గుర్రుగానే ఉన్నట్టు తెలుస్తోంది.

Next Story