రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..

by Kodari Anjali |

రూరల్ మండలం తల్లంపాడు సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..
X

దిశ, ఖమ్మం రూరల్: రూరల్ మండలం తల్లంపాడు సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు ప్రమాదానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన వ్యక్తిని కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన అజయ్గా గుర్తించారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కింద పడిపోయాడా, లేక గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story