పైప్ లైన్ పనుల్లో అపశృతి...మట్టిలో ఇరుక్కున్న కార్మికుడు

by velandi.Saikiran |

పైప్ లైన్ పనుల్లో అపశృతి చోటు చేసుకుని... ఓ కార్మికుడు మ‌ట్టిలోనే ఇరుకున్నాడు. ఈ దారుణమైన సంఘటన కొత్తగూడెంలో

పైప్ లైన్ పనుల్లో అపశృతి...మట్టిలో ఇరుక్కున్న కార్మికుడు
X

దిశ, కొత్తగూడెం: పని ప్రదేశాల్లో నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ సంఘటన కళ్ళకు కట్టినట్లు చూపించింది. పైప్ లైన్ పనుల్లో అపశృతి చోటు చేసుకుని... ఓ కార్మికుడు మ‌ట్టిలోనే ఇరుకున్నాడు. ఈ దారుణమైన సంఘటన కొత్తగూడెంలో శనివారం చోటుచేసుకుంది. కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ సెయింట్ మేరీస్ స్కూల్ ముందు పైప్ లైన్ మరమత్తు పనులు జరుగుతున్నాయి. ఇందులో మిగిలిన పనిని పూర్తి చేసేందుకు బీహార్ కు చెందిన సంతోష్ అనే కార్మికుడిన తీసుకువ‌చ్చారు.

అయితే.. అత‌ను మిషన్ భగీరథ పైప్ లైన్‌ గుంతలో ఉండగానే, మట్టి ఒక్కసారిగా సంతోష్‌పై ప‌డింది. దీంతో మట్టిలో ఇరుక్కుపోయాడు. అనంత‌రం జెసిబి సాయంతో కార్మికున్ని బయటికి తీశారు. కార్మికుడు అపస్మార‌క‌ స్థితికి వెళ్లడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మరమ్మత్తులు జరిగే సమయంలో కార్పొరేషన్ అధికారులు అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రజలు మండిపడుతున్నారు.

Next Story