కలుపు మందు తాగి మహిళా ఆత్మహత్యాయత్నం

by velandi.Saikiran |

కలుపు మందును కూల్ డ్రింక్ లో ఓ మహిళ కలిపి, తాను తాగి పిల్లలకు తాగించిన సంఘటన సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో

కలుపు మందు తాగి మహిళా ఆత్మహత్యాయత్నం
X

దిశ, సత్తుపల్లి: కలుపు మందును కూల్ డ్రింక్ లో ఓ మహిళ కలిపి, తాను తాగి పిల్లలకు తాగించిన సంఘటన సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ద్వారకాపురి కాలనీకి చెందిన పటాన్ సల్మా (28) ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంది. భర్త సలీం బజాజ్ షోరూం లో మెకానిక్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తుండగా పటాన్ సల్మా, సలీం దంపతులకు పటాన్ నస్మిన్,( 9) సయాన్ (6) కుమారులతో కలిసి జీవిస్తున్నారు.

అయితే, తల్లి సల్మా శుక్రవారం కలుపు మందును కూల్ డ్రింక్ లో కలిపి పిల్లలకు ఇవ్వగా నస్మిన్, పెద్ద కుమారుడు తాగేందుకు నిరాకరించి బయట పారబోశారు. చిన్న కుమారుడు సయాన్ కలుపు మందు కలిపి కూల్ డ్రింక్ ను తల్లితో పాటు తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి, స్థానిక సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరంచారు. ఇక మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియ రాలేదు.

Next Story