మందుబాబుల‌కు షాక్‌..వైన్స్‌ బంద్

by velandi.Saikiran |

హోలీ పండుగ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలు జారీ చేశారు.

మందుబాబుల‌కు షాక్‌..వైన్స్‌ బంద్
X

దిశ, ఖమ్మం క్రైమ్: హోలీ పండుగ (2026 మార్చి 3) సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని కమిషనర్ సునీల్ దత్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షలు ఉదయం 6 గంటల నుంచి మార్చి 4 ఉదయం 6 గంటల వరకు వర్తిస్తాయని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు బహిరంగ ప్రదేశాల్లో గొడవలు జరగకుండా నిరోధించడానికి ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.హోలీని ప్రశాంతంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సూచించారు.

Next Story